ప్రెగ్నెంట్ అంటూ అంద‌రి చెవిలో పువ్వులు పెట్టిన ఇలియానా.. అస‌లు నిజం ఇదే!?

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవ‌ల తాను తల్లి కాబోతున్నాన‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో తెలిపింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్‌ చేసింది. దాంతో ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందంటూ నెట్టింట తెగ ప్ర‌చారం జ‌రిగింది.

పెళ్లి ఎప్పుడు అయ్యింది? నీకు పుట్ట‌బోయే బిడ్డ‌కు తండ్రి ఎవరు? ఎవరితో బిడ్డను కంటున్నావ్? ఇలా నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఇలియానాకు సంధించారు. కానీ, ఇలియానా మాత్రం ఎలాంటి ఆన్స‌ర్ ఇవ్వ‌లేదు. మ‌రోవైపు కత్రినాకైఫ్‌ సోదరుడు స్టెబాస్టిన్‌తో ఇలియానా రిలేషన్‌లో ఉందని.. ఆమె బిడ్డ‌కు అత‌డే తండ్రి అని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

 

అయితే ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ అంద‌రి చెవిలో పువ్వులు పెట్టింద‌ని ఇప్పుడు టాక్ న‌డుస్తోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. తాజాగా ఇలియానా బీచ్‌లో బికినీలో దిగిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ లో ఇలియానాకు బేబీ బంప్ ఏ మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇలియానా గ‌ర్భం దాల్చ‌లేద‌ని.. ఒక‌వేళ ఆమె ప్రెగ్నెంట్‌ అయితే ఇలా బికినీ లో కనిపించేది కాదని.. ఏదో సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే ఆమె అలాంటి పోస్ట్ పెట్టింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ఆమె బేబీ బంప్ కనిపించేంత ఎక్కువ వారాలు నెలలు అవ్వలేదేమో అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇలియానా బేబీ బంప్ క‌నిపించేంత వ‌ర‌కు ఆమె ప్రెగ్నెన్సీని న‌మ్మ‌లేమ‌ని అంటున్నారు.