ఆషికా రంగనాథ్.. ఈ ముద్దుగుమ్మ `అమిగోస్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఇది ఆమెకు తొలి చిత్రం కాదు. కన్నడ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ 2016లోనే `క్రేజీ బాయ్` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కన్నడలోనే దాదాపు డజన్ చిత్రాల్లో నటించింది.
నటిగా మంచి మార్కులే పడినా.. స్టార్ హోదా మాత్రం దక్కలేదు. అయితే `అమిగోస్` మూవీతో తన దశ తిరిగిపోతుందని ఆషికా భావించింది. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో తాను మోస్ట్ వాంటెడ్ అయిపోతానని భావించిన ఆషికాకు నిరాశే ఎదురైంది. అమిగోస్ దెబ్బకు టాలీవుడ్ లో అడ్రెస్ లేకుపోయింది. అటు కన్నడలోనూ ఆఫర్లు అంతంత మాత్రంగానే మారడంతో.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. తరచూ గ్లామరస్ ఫోటో షూట్లతో ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. మరి ఈ విధంగా ఆషికా ఫిల్మ్ మేకర్స్ కళ్లల్లో పడుతుందేమో చూడాలి.