ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో అతనే.. ఎంత స్పెషల్ అంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే . అప్పటివరకు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ డాల్ గా చూస్తున్న జనాలకు ..హీరోయిన్ సాయి పల్లవి ..హీరోయిన్ అంటే ఇది హీరోయిన్స్.. నటన కూడా చేయగలరు.. హీరోయిన్స్ నటన పరంగా మెప్పించి హిట్ కొట్టగలరు అని ప్రూవ్ చేసింది . అడుగుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో హిట్లు ప్లాప్ లు అనే సంబంధం లేకుండా.. ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ వేయించుకుంది.

ప్రజెంట్ సాయి పల్లవి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . కానీ స్టార్ హీరోలకి మించిన క్రేజ్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . దానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి పెట్టుకునే కమిట్మెంట్స్ నే కారణం అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఇండస్ట్రీలో రొమాన్స్ – ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉన్న ఏకైక హీరోయిన్గా సాయి పల్లవి పేరు సంపాదించుకుంది .

అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సాయి పల్లవి ఏనాడు తన హద్దులు మీరలేదు ..లిమిట్స్ క్రాస్ చేయలేదు. కానీ ఒక హీరోతో మాత్రం లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చింది . ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోయిన్ సాయి పల్లవి హీరో నాగచైతన్య నటించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమాలో సాయి పల్లవి ఏకంగా నాగచైతన్య కు లిప్ లాక్ చేస్తుంది. ఈ సినిమాలో తప్పిస్తే మిగతా ఏ సినిమాలో కూడా హీరోయిన్ సాయి పల్లవి హద్దులు మీరింది లేదు . అంతే కాదు ఇకపై మీరుతోందన్న అవకాశాలు నమ్మకాలు కూడా జనాలకి లేవు. అలా ఇండస్ట్రీలోనే ఒక క్రేజీ రికార్డును నెలకొల్పాడు నాగచైతన్య..!!