బాలయ్య సినిమాలో తారకరత్న పాత్రలో ఆ స్టార్ హీరో..!!

ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాక శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది.

Taraka Ratna is alive because of Balakrishna: Producer - Telugu News -  IndiaGlitz.com
తాజాగా ఈ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఆయనది చాలా కీలకమైన పాత్ర అని అందుకే ఈ రోజు కోసం అర్జున్ కపూర్ను సంప్రదించినట్లుగా సమాచారం వాస్తవానికి ఈ సినిమాలోని పాత్రలో తారకరత్న నటించాల్సి ఉందట. కానీ ఆయన అకాల మరణంతో ఈ పాత్రలో ఇప్పుడు అర్జున్ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం.

Delhi has been a lucky charm for me: Arjun Kapoor

పక్కా తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా యాక్షన్ డ్రామాలో తెరకెక్కిస్తున్నారు. ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న బాలయ్య కాళీమాత భక్తుడుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీల బాలయ్య కాజోల్ మధ్యలో వచ్చే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి అని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా గురించి వినిపిస్తున్న గాసిప్స్ రోజు రోజుకు మరింత అంచనాలను పెంచేస్తున్నాయి. బాలయ్య అనిల్ రావు పూడి కాంబినేషన్లో రాకపోతే ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.