చిరంజీవి తల్లి అంజనా దేవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం చిరంజీవి అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా అంజనాదేవి గారికి మాత్రం ఫేవరెట్ హీరో వేరే ఉన్నారట.

చిరంజీవి తల్లి అంచనా దేవి గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొడుకులకు ప్రతి విషయంలో కూడా అండగా ఉండే ఆమెకు.. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరు దక్కించుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టమట. ఒకప్పుడు అక్కినేని గారు ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలలోనే నటించి అమ్మాయిల మనసులను దోచుకున్నారు. దాంతో ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉండేది. ఇక అంజనదేవి గారు కూడా ఊహ తెలిసిన రోజు నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం పెంచుకున్నారట.

అంజనా దేవి గారు అక్కినేని వీరాభిమాని అట. మరొకవైపు చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని.. ఇంకొక వైపు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చారు చిరంజీవి . అలా ఎంట్రీ ఇచ్చిన ఈయన అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ నిరూపించుకొని మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.