బిచ్చగాడు హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో బిచ్చగాడు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సాట్నా టైటాన్.. తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో విజయ్ ఆంటోని నటించారు. తల్లి ప్రాణం కోసం కొడుకు ఆరాటపడే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ప్రతి ప్రేక్షకులు కూడా హృదయాన్ని తాకే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు.

Satna Titus Latest News & Updates | Read Breaking news

ఈ సినిమా తర్వాత నీది నాది ఒకే కథ తమిళంలో తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది చేసింది తక్కువ సినిమాలే అని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ.సాట్నా టైటాన్ 1991 నవంబర్ 28న కేరళలో కొచ్చిలో జన్మించింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈమె నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా తమిళంలో తెలుగులో బిచ్చగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు బాగా గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటించి పలు వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది.

Pichaikkaaran Movie Actress Satna Titus Family Photos

కెరియర్ బాగా సాగుతున్న సమయంలో బిచ్చగాడు సినిమా తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తిని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అతనితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిపై ఆమె తల్లి అప్పట్లో పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఒప్పుకున్న చిత్రాలన్నీ సాట్నా వదిలేయడం జరిగింది. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ కుటుంబంతో బాగా ఎంజాయ్ చేస్తుంది వీరికి కిరణ్ కార్తీక్ అనే కుమారుడు కూడా ఉన్నారు ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Satna Titus (@satnatitusofficial)