ప్రభాస్ వల్లే మహేష్ ఆ సినిమా చేశారా.. ఎలాగంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం జరిగింది.ఇందులో మరొక హీరో వెంకటేష్ కూడా నటించారు. హీరోయిన్లుగా అంజలి ,సమంత అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ చిన్నోడుగా పెద్దోడిగా వెంకటేష్ నటించారు.

Seethamma Vakitlo Sirimalle Chettu: A Love Letter To All Things Telugu
అయితే ఈ సినిమా మహేష్ బాబు నటించిన వెనుక ఒక చిన్నపాటి కథ ఉన్నట్లు తెలుస్తోంది.. అదేమిటంటే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు . మహేష్ బాబు తనకు ఏదైనా చిత్రం నచ్చింది అంటే చాలు కచ్చితంగా వెంటనే హీరోకు.. మెసేజ్ పెట్టడం ఫోన్ చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు దిల్ రాజుకు మెసేజ్ పెట్టారట. ఈ సినిమా చాలా బాగుంది మాస్ హీరోని కూడా క్లాస్ గా చూపించారని మెసేజ్ పెట్టడం జరిగిందట మహేష్ బాబు.

Watch No. 1 Mr Perfect Movie Online for Free Anytime | No. 1 Mr Perfect  2011 - MX Player

ఆ సమయంలోనే శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కథను సిద్ధం చేస్తున్నారట. పెద్దోడి పాత్రకు వెంకటేష్ను ఫిట్ చేశారట. అయితే మహేష్ మెసేజ్ చూసిన దిల్ రాజు వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు ఫోన్ చేసి మహేష్ బాబుకు ఈ కథ చెబుదాం అని తెలియజేశారట. ఆ వెంటనే దూకుడు సినిమా సెట్స్ పై ఉండగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కథను చెప్పడం జరిగింది ఆ వెంటనే మహేష్ బాబు కూడా ఈ సినిమా కథను ఒప్పుకోవడం జరిగింది అలా ప్రభాస్ సినిమా కారణంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ నటించారు.