`ద‌స‌రా` దండ‌యాత్ర‌.. ఒక్క వారానికే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల దండ‌యాత్ర చేస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది.

ఇక వారం రోజుల్లో భారీ లాభాల‌తో దూసుకెళ్తోంది. విడుద‌లైన 7వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ. 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 21.49 కోట్లు
సీడెడ్: 4.98 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 3.85 కోట్లు
తూర్పు: 2.00 కోట్లు
పశ్చిమ: 1.15 కోట్లు
గుంటూరు: 2.23 కోట్లు
కృష్ణ: 1.69 కోట్లు
నెల్లూరు: 0.82 కోట్లు
——————————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 38.21 కోట్లు(64.75 కోట్లు~ గ్రాస్‌)
——————————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 4.20 కోట్లు
ఇతర భాషలు – 1.40 కోట్లు
నార్త్ ఇండియా – 1.76 కోట్లు
ఓవ‌ర్స్ – 9.60 కోట్లు
————————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 55.17 కోట్లు(99.20 కోట్లు~ గ్రాస్)
————————————————

కాగా, రూ. 49 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మొత్తం మీద ఫస్ట్ వీక్ తర్వాత రూ. 6.17 కోట్ల లాభాల‌తో ముందుకు సాగుతోంది.