పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!

మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు.

Chiranjeevi meets Pawan Kalyan?

తాజాగా పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి మాట్లాడినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం. వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్ సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి అతని పొలిటికల్ ఎంట్రీ పైన స్పందించడం జరిగింది.. చిరంజీవి మాట్లాడుతూ నేను సినిమాల పరంగా చాలా హైట్స్ చూశాను.. నా సినిమాలు నా డ్యాన్స్ నటన నచ్చి నాకు ఫ్యాన్స్ మాత్రమే ఏర్పడ్డారు కానీ పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ఇట్లయితే లేవు కానీ అతను సినిమాలకు టాక్ బాగా లేకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi-Pawan Kalyan's mega combination finally happening: Subbarami  Reddy makes it official - IBTimes India
పవన్ కళ్యాణ్ తనంతా నటుడు అయితే కాదు కానీ డాన్స్ కూడా అంతంత మాత్రమే వస్తుంది… కానీ నాకంటే ఎక్కువ ఫ్యాన్ ఏర్పరుచుకున్నాడు.. అందుకు కారణం అతని వ్యక్తిత్వమే అంటూ తెలిపారు చిరంజీవి. అంతేకాకుండా రాజకీయాలలో ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా అతని చుట్టూ అభిమానులు అండగా నిలబడ్డారు. ఎప్పటికైనా తను అనుకున్నది సాధిస్తాడని నమ్మకం తనకు ఉంది అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. గతంలో కూడా చిరంజీవి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి దెబ్బతిన్నారని చెప్పవచ్చు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.