సీక్రెట్ ప్లేస్ లో సంయుక్త టాటూ.. అందులో ఇంత అర్థం ఉందా?

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లో విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్‌.. రీసెంట్ గా `విరూపాక్ష` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది.

గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. దీంతో సంయుక్త ఖాతాలో నాలుగో హిట్ ప‌డ‌టంతో.. ఆమెను గోల్డ్ లెగ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హీరో హీరోయిన్లు ఒంటిపై టాటూలు వేయించుకునే ట్రెండ్ ఎప్పట్నుంచో కొనసాగుతుంది. చాలా మంది అందంగా, హాట్‌గా కనిపించేందుకు టాటూలు వేయించుకుంటే.. మ‌రికొంద‌రు ప్రియ‌మైన వారి గుర్తుగా టాటూలు వేయించుకుంటున్నారు.

మ‌న సంయుక్త మీన‌న్ కూడా ఓ సీక్రెట్ ప్లేస్ లో టాటూ టేయించుకుంది. అది కాస్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సంయుక్త త‌న‌ వీపు పై ప‌చ్చ‌బొట్టు వెయించుకుంది. మలయాళంలో రాయించిన ఆ అక్షరాలకు అర్థమేంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఎట్టకేలకు ఆ అక్షరాలకు అర్థం తెలిసింది. సంచారి అని మలయాళీ పదం.. దానికి తెలుగులో బాటసారి, ప్రయాణికుడు అని అర్ధాలు వస్తాయి. నిజానికి అసంతృప్తిగా ఉన్నప్పుడు సంయుక్త‌కి ఒంటరిగా ప్రయాణాలు చేయడం బాగా అల‌వాటు అట‌. ఈ విషయం ప్రతిబింబించేలా ఆ టాటా వేసుకుంద‌ట‌. అద‌న్న‌మాట సంయుక్త టాటూ సీక్రెట్‌.