గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చింది.. బ్రేక‌ప్ పై అఖిల్ ఓపెన్‌!

గ‌ర్ల్‌ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడ‌మ్ వ‌చ్చిదంటూ బ్రేక‌ప్ పై అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. అయితే ఇది రియ‌ల్ గా కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అఖిల్ తాజా చిత్రం `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై నిర్మ‌త‌మైన ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా యాక్షన్‌ అవతార్‌లో ఎంటర్‌టైన్ చేయ‌బోతున్నాడు. మ‌ల‌యాళ‌ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. ముర‌ళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణమురళి ఇతర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి తాజాగా `రామ కృష్ణ‌..` అంటూ సాగే ఓ సాంగ్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు మేక‌ర్స్‌. ఇదొక బ్రేక‌ప్ సాంగ్. `రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె.. ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా.. పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా.. వచ్చిందా వచ్చిందా ఫ్రీడం వచ్చిందా` అంటూ సాగే ఈ పాట యువ‌త‌ను బాగా అల‌రిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేశారు. రామ్ మిర్యాల సూప‌ర్ ఎనర్జిటిక్‌గా పాడారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.