హీరోయిన్లు పెదాల‌కే కాదు… అక్క‌డ కూడా సర్జరీ చేయించుకుంటారా..?

హీరోయిన్స్ అన్న తర్వాత వారీ శరీరంలో కొన్ని భాగాలను అందంగా కనిపించడానికి, చూపించ‌డానికి నానా తంటాలూ పడుతుంటారు. మేకప్‌తో ఎంతవరకూ అందంగా కనిపించాలో అంతవరకూ ప్రయత్నాలు చేస్తారు. కాస్ట్యూమ్స్‌తో కొంతవరకూ తమ అందాన్ని రెట్టింపు చేసుకునేలా తాపత్రయపడతారు. ఆ రకంగా కూడా బాగానే జనాలను ఆకట్టుకుంటున్నారు.

అయితే, కెమెరాలో కొన్ని కోణాలలో హీరోయిన్స్‌లో ఉన్న లోపాలు బయటపడతాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. హీరో కంటే కూడా ఎక్కువగా హీరోయిన్ మీదనే కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. ముక్కు బాగోలేదని, చాతి చిన్నగా ఉందని.. లేకపోతే అదే చాతి మరీ పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉందనీ, పిరుదల భాగం ఎట్రాక్ట్‌గా లేదని..ఇలా ఒకటి కాదు..వంద వంకలు పెడుతున్నవారూ ఉన్నారు.

గతంలో రాశి ఎంత అందంగా ఉందో ఎన్ని ప్రశంసలు కురిసాయో.. ఈమె ఎద అందాల మీద కూడా ఇలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. తన ఎద అందాలు ఏపుగా కనిపించి కొందరినీ కవ్వించి నిద్ర లేకుండా చేస్తే..కొందరు మాత్రం మరీ ఇంత భారీగా ఉంటాయా ? అని కామెంట్స్ చేశారు. శృతి హాసన్ ముక్కు బాగోదనీ, హన్షిక మొత్వానీ మరీ లావెక్కి అన్నీ జారిపోయాయని.. ఇలా హీరోయిన్స్ గురించి రక రకాలుగా మాట్లాడుకున్నారు.

ఇలాంటి లోపాలను సరిదిద్దుకోవాలని మన హీరోయిన్స్ కొందరు కలర్ తక్కువ ఉంటే అది పెంచుకోవడానికి, ఎద అందాలు బాగా కనిపించేందుకు, ముక్కు బావుండేందుకు..బొడ్డు రొమాంటిక్‌గా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. మన సౌత్ హీరోయిన్స్ మాత్రమే కాదు బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ ఇలా తమ శరీర భాగాలను సర్జరీ ద్వారా మెరుగుపరచుకున్నవారే. వారికే ప్రేక్షకులు అభిమానులుగానూ మారిపోయారు.