మొన్న అలా.. నేడు ఇలా.. నాగ‌చైత‌న్య అంటే అఖిల్ కు ఇష్టం లేదా..?

కింగ్ నాగార్జున వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి నాగ‌చైత‌న్య‌, అఖిల్ అడుగు పెట్టారు. నాగ‌చైత‌న్య ఆల్రెడీ తానేంటో నిరూపించుకుని స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అఖిల్ మాత్రం హీరోగా నిల‌దొక్కుకునేందుకు ఇంకా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక‌పోతే నాగచైతన్య, అఖిల్ ఒక తల్లికి పుట్టకపోయినప్పటికీ.. సొంత అన్న‌ద‌మ్ముల మాదిరి ఉంటారు.

కానీ, గ‌త కొద్ది రోజుల నుంచి వీరి మ‌ధ్య విభేదాలు త‌ల్లెత్తాయంటూ వార్త‌లు వస్తున్నాయి. మొన్న‌టికి మొన్న నాగ‌చైత‌న్య‌ను అఖిల్‌ సైలెంట్ కిల్ల‌ర్ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే మ‌రోవైపు అఖిల్ బ‌ర్త్‌డేకు నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌లేదు. ఇక తాజాగా `ఏజెంట్‌` ప్ర‌మోష‌న‌ల్‌ ఈవెంట్ లో అఖిల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నాగ చైతన్య-అఖిల్ కలిసి మల్టీస్టారర్ చేయాలనేది అభిమానుల కోరిక. ఈ విష‌యంపై స్పందిస్తూ అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

నాగ‌చైత‌న్య‌తో మ‌ల్టీస్టార‌ర్ క‌ష్టం అన్న‌ట్లు వ్యాఖ్యానించాడు. `ఇతర హీరోలతో మల్టీస్టారర్ చేస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ అన్నదమ్ములు మల్టీస్టారర్ చేయడం భిన్నమైన వ్యవహారం. ఇద్దరికీ మంచి పాత్రలు లభించాలి. స్క్రిప్ట్ కుదరాలి. అప్పుడే ఆ మల్టీస్టారర్ సెట్ అవుతుంది.` అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఇత‌ర హీరోల‌లో మ‌ల్టీస్టార‌ర్ ఒకే.. కానీ అన్న‌తో మాత్రం నో అని ప‌రోక్షంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. దీంతో నాగ‌చైత‌న్య అంటే అఖిల్ కు ఇష్టం లేదా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.