కీర్తి సురేష్ దసరా మాస్ డాన్స్ కు స్టెప్పులేస్తున్న నటి ఇంద్రజ.. వీడియో వైరల్..!!

గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలోని మాస్ బీట్ డాన్స్ వైరల్ గా మారుతోంది. దసరా సినిమా మార్చి 30వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో హీరోగా నాని నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో ఊర మాస్ లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది నాని నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా పాత్ర ఉందని చెప్పవచ్చు.

Sridevi Drama Company Latest Promo | Coming Soon | Indraja | ETV Telugu -  YouTube

ఇక ఈ చిత్రంలోని సాంగ్ సైతం సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతోంది.ముఖ్యంగా చమ్కీల అంగీలేసి సాంగ్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ పాటకు డాన్స్ వేయడం జరిగింది. ఈ సాంగ్ తర్వాత పాపులర్ అయిన మరొక బీర్ కీర్తి సురేష్ వేసిన డాన్స్.. కీర్తి సురేష్ పెళ్లికూతురు చీరల వేసిన ఈ మాస్ డాన్స్ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Keerthy Suresh Took 25 Takes For Baraat Dance In Dasara

ఫుల్ ఎనర్జీతో పక్క మాస్ లెవెల్ లో కీర్తి సురేష్ ఈ మాస్ బీటకు డాన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఇదే బీటుకు అలనాటి హీరోయిన్ ఇంద్రజ కూడా డాన్స్ వేయడంతో మరింత వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేర్ చేస్తోంది కీర్తి సురేష్ ఎంత అద్భుతంగా వేసిందో ఇంద్రజ కూడా అంతే అద్భుతంగా వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అడపాదప సినిమాల్లో నటిస్తున్న ఇంద్రజ జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.