ఐబొమ్మ లవర్స్‌కి షాక్.. మళ్లీ ఏమైందంటే..

ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్‌లో చూడాలంటే వందలు, వేలు ఖర్చు అవుతాయి. అలా కాకుండా మంచి క్వాలిటీ సినిమా ఫ్రీగా చూడాలంటే ఒకటే దారి అదే ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్. మారు మూల ప్రాంతంలోని సినీ ప్రేమికులు కూడా ఈ వెట్‌సైట్ విజిట్ చేస్తున్నారు లేదా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐబొమ్మ సైట్ కొన్ని ఇబ్బందులను ఎదురకొంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేసినా.. మళ్ళీ ఇప్పుడు ఐబొమ్మ యాప్ ఓపెన్ కావడం లేదని అంటున్నారు. దాంతో అసలు ఐబొమ్మకు ఏమైందనే చర్చలు జరుగుతున్నాయి.

రూపాయి ఖర్చు లేకుండా, హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలను అందిస్తుంది ఐబొమ్మ. పైరసీ అయినా పేదవారికి ఇదే వన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్‌లో సినిమా డౌన్‌లోడ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. దాంతో ఎవరైనా సరే దీనిలో చాలా సులభంగా నచ్చిన సినిమా చూడొచ్చు. అయితే కొందరు నిర్వాహకులు మాత్రం ఐబొమ్మ వెబ్‌సైట్‌ని బ్యాన్ చెయ్యాలి అంటూ డిమాండ్స్ చేస్తున్నారు. ఐబొమ్మ కారణంగా ఓటీటీ సంస్థలను ఎవరూ కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగా గతంలో కొన్ని రోజులు ఐబొమ్మ సైట్ కనిపించలేదు.

కానీ కొందరు హ్యాకర్స్ మాత్రం ఐబొమ్మ లోగోతో ఫేక్ సైట్ ని తయారు చేశారు. ఆ నకిలీ సైట్‌ని కొంతమంది ఓపెన్ చెయ్యడంతో వారి ఫోన్స్ హ్యాంగ్ అయ్యాయి. దాంతో ఇక ఐబొమ్మ పని ముగిసిపోయిందని అంతా అనుకునే సమయానికి ఆ వెబ్ సైట్ నిర్వాహకులు కొత్త ఫీచర్స్ తో ఐ బొమ్మ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ మళ్ళీ ఆ సైట్ ఇబ్బందులకు గురి అవుతుందని కొంతమంది అంటున్నారు. దాంతో అసలు ఈ ఐబొమ్మకి ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.