ఎన్టీఆర్ స‌తీమ‌ణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాస‌న‌.. కాస్ట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ మ‌ధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మ‌రింత బ‌ల‌ప‌డింది.

అలాగే ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ స‌న్నిహిత్యంతోనే ఇటీవ‌ల పుట్టినరోజు జ‌రుపుకున్న ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి ఉసాప‌న అదిరిపోయే గిఫ్ట్ పంపింద‌ట‌. లక్ష్మీ ప్రణతి కి ఓ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ బ‌హుబ‌తిగా ఇచ్చింద‌ట‌. పైన‌ ఫోటోలో కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

చాలా స్టైలిష్ గా మ‌రియు ట్రెండీగా ఉన్న‌ ఈ హ్యాండ్ బ్యాగ్ మగువ‌ల‌ను తెగ ఆక‌ర్షిస్తోంది. దీంతో ఆ బ్యాగ్‌ కాస్ట్ ఎంత అని అమ్మాయిలు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఉపాస‌న గిఫ్ట్ గా ఇచ్చిన ఆ బ్యాగ్ ధ‌ర తెలిస్తే మైంబ్ బ్లాకే. ఎందుకంటే, ఈ బ్యాగ్‌ కాస్ట్ అక్షరాలా 3 లక్షల 28 వేల 145 రూపాయలట. అంతే కాదు రూ. 45, 000 విలువ చేసే ఓ డ్రెస్ ను కూడా ఉపాసన లక్ష్మీ ప్రణతి కోసం తీసుకుందని అంటున్నారు.