వ్య‌భిచారులుగా మారిన టాలీవుడ్ హీరోయిన్లు వీరే…!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోయిన్లు వ్య‌భిచారులుగా న‌టించి మెప్పించారు. గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డం అంటే ఏ హీరోయిన్‌కు అయినా సులువే. కానీ వ్య‌భిచారులుగా న‌టించాలంటే న‌ట‌న‌లో ఎంతో రాణించాల్సి ఉంటుంది. వ్య‌భిచారి క్యారెక్ట‌ర్ పండ‌డం అంత స‌లువు కాదు. స్టార్ హీరోయిన్లుగా ఉన్న ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, ఛార్మీయే కాదు.. హోమ్లీ క్యారెక్ట‌ర్లు వేసే స్నేహ కూడా ఓ సినిమాలో వ్య‌భిచారిగా న‌టించింది. మ‌రి వ్య‌భిచారులుగా న‌టించి మెప్పించిన ఆ హీరోయిన్లు ఎవ‌రో.. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

క‌మ‌ల్‌హాస‌న్ పంచ‌తంత్రం సినిమాలో వ్య‌భిచారిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత సూపర్‌ డీలక్స్‌ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇక అనుష్క సైతం వేదం సినిమాలో తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఆమె నటను ఫిదాకాని వారుండరు. ఇక శ్రీయ సైతం పవిత్ర సినిమాలో వ్యభిచారిపాత్రలో ఒదిగిపోయింది. రాజకీయనాయకులు ఎంతకు దిగజారుతారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించగా శ్రీయ అద్భత నటనతో ఆకట్టుకుంది.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన స్నేహ ఓ తమిళ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఛార్మి తన లాస్ట్ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించింది. పూరి దర్శకత్వంలో జ్యోతిల‌క్ష్మి సినిమాలో వ్య‌భిచారం చేసే అమ్మాయిగా న‌టించింది. ఇక సదా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను టార్చ్‌లైట్ సినిమాలో రోడ్ల ప‌క్క‌న లారీడ్రైవ‌ర్ల కింద న‌లిగిపోయే ప‌చ్చి వ్య‌భిచారి పాత్ర‌లో న‌టించింది.

అనుష్క ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక ఐదేళ్ల‌కు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వేదం సినిమాలో వ్య‌భిచారిగా క‌న్నీళ్లు తెప్పించింది. అస‌లు వ్య‌భిచారులు మ‌గాళ్ల‌ను ఎలా క‌వ్విస్తారో.. అచ్చుగుద్దిన‌ట్టు అవే ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఆమె త‌న న‌ట‌న‌తో వేదంలో హైలెట్ అయ్యింది. ఈ విధంగా ఎంద‌రో హీరోయిన్లు వ్య‌భిచారులుగా నంటించి మెప్పించారు.

Share post:

Latest