బిగ్‌బాస్ ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. సీజన్-7లో ఆ హీరో సెలెక్ట్..

అన్ని భాషలలో ఎంతో ప్రేక్షకాధరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఇటీవలే తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 6 అయిపోయినట్లే లేదు అప్పుడే సీజన్ 7 కి సంబంధించిన హడావిడి మొదలైంది. బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. అయితే ఈసారి వచ్చే సీజన్ లో కొంతమంది స్టార్స్ హౌజ్‌లో సందడి చేయనున్నట్లు సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి.

ఆ స్టార్స్ లో యాంకర్ రష్మీ, కమెడియన్ కమ్ హీరో సుధీర్, యాంకర్ ప్రదీప్ లాంటి వాల్ల పేర్లు వినబడుతున్నాయి. తాజాగా ఇంకో స్టార్ హీరో పేరు ఎక్కువగా వినపడుతుంది. బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్న సీరియల్ ‘జానకి కలగనలేదు’ హీరో అమర్ దీప్ బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్ గా వస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. తన నటనతో ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న అమర్ దీప్ ని బిబి హౌస్ కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

అయితే ఈ విషయంపై అమర్ దీప్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమర్ దీప్ మాట్లాడుతూ ‘నాకు బిగ్ బాస్ 7 లో ఆఫర్ వచ్చింది అని వార్తలు వస్తున్నాయ్. నాకు ఆఫర్ ఇచ్చారా లేదా అనేది స్టార్ మా ఛానెల్ వాళ్ళకే తెలియాలి. నా చేతులలో ఏముంది. అయినా నేను ప్రస్తుతం సీరియల్స్ లో చాలా బిజీ గా ఉంటున్నాను. ఇలాంటి సమయంలో స్టార్ మా వాళ్ళు నన్ను బిబి హౌస్ లో కి వెళ్ళడానికి ఎంపిక చేస్తారా? లేదా? అనేది చూడాలి. నేను హౌస్ లో వెళ్లడం, వెళ్లకపోవడం అనేది స్టార్ మా ఛానెల్ తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.’ అని బిబి హౌస్ గురించి తనపై వస్తున్నా వార్తలను గురించి క్లారిటీ ఇచ్చాడు అమర్ దీప్.