బ‌న్నీ చెంప చెల్లుమ‌నేలా చేసిన చిరంజీవి.. ఇప్పుటికైనా బుద్ధి తెచ్చుకో?

మెగా ఫ్యామిలీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు విభేదాలు ఏర్ప‌డ్డాయ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ వ్య‌వ‌హార శైలి కూడా ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తోంది. గ‌త కొద్ది రోజుల నుంచి మెగా హీరో అన్న ఇమేజ్ ను ప‌క్క‌న ప‌డేసి అల్లు హీరోగా త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. అల్లు బ్రాండ్ ను లేపేందుకు తెగ కృషి చేస్తున్నాడు.

మెగా ఫ్యాన్స్ తో సంబంధం లేకుండా అల్లు ఆర్మీ అంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 37వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్నాడు. త‌న‌యుడి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను చిరంజీవి ఘ‌నంగా జ‌రిగించారు. ఈ వేడుక‌ల‌కు టాలీవుడ్ మొత్తం క‌ద‌లివ‌చ్చింది. కానీ, బ‌న్నీ మాత్రం దూరంగా ఉన్నాయి. అస‌లు రామ్ చ‌ర‌ణ్ కు సోష‌ల్ మీడియా ద్వారా క‌నీసం విషెస్ కూడా తెల‌ప‌లేదు. బ‌న్నీ ప్ర‌వ‌ర్త‌న‌ను చాలా మంది త‌ప్పుప‌ట్టారు.

ఇదే స‌మ‌యంలో బ‌న్నీ చెంప చెల్లుమ‌నేలా చేశారు చిరంజీవి. తాజాగా టాలీవుడ్ లో బ‌న్నీ ఇర‌వై ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా `డియర్ బన్నీ సినిమాల్లో నువ్వు 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నీ చిన్ననాటి జ్ఞ్యాపకాలు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఓ పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్. నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలి మరింత అభిమానాన్ని గెలవాలని కోరుకుంటున్నాను` అని చిరు ల‌వ్లీ పోస్ట్ పెట్టారు. దీంతో చిరు పోస్ట్ ను వైర‌ల్ చేస్తూ బ‌న్నీని ఏకేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చావు.. ఇప్పుడు భారీ స్టార్డ‌మ్ రాగానే ఆ ఫ్యామిలీని వ‌ద్ద‌నుకుంటున్నావు. కానీ, నువ్వు ఎంత దూరం పెట్టినా.. మెగా ఫ్యామిలీ నీకెప్పుడూ అండ‌గానే ఉంటుంది. ఇప్పుటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ బ‌న్నీకి చుర‌క‌లు వేస్తున్నారు.