శ్రీదేవిని రాజశేఖర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఒక పక్క యాక్షన్ సినిమాలలో నటిస్తూనే మరొక పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ బాగా క్రేజీ సంపాదించారు. ఇదంతా ఇలా ఉంటే రాజశేఖర్ అలనాటి హీరోయిన్ శ్రీదేవి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై గతంలో రాజశేఖర్ మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Sridevi's Mother Approached Dr Rajshekhars Family For Marria

నటుడు రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి ఇద్దరు కూడా మంచి స్నేహితులే నట. శ్రీదేవి, రాజశేఖర్ కు వివాహం చేయాలని కూడా నిశ్చయించారట. కానీ అప్పట్లో రాజశేఖర్ సినిమాలలో ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే సినిమాలలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.. కానీ వీరి వివాహానికి రాజశేఖర్ తల్లి గారు అసలు ఒప్పుకోలేదట సినీ పరిశ్రమ కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవద్దని ఆమె రాజశేఖర్తో ఓటు వేయించుకుందట.. అందుచేతనే శ్రీదేవిని వివాహం చేసుకోలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు రాజశేఖర్.

కానీ అనుకోకుండా రాజశేఖర్ కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.అతను కూడా స్టార్ హీరోగా ఎదిగారు చివరికి రాజశేఖర్ కూడా సినీ పరిశ్రమకు చెందిన జీవిత గారిని వివాహం చేసుకోవడం జరిగింది. 1991 వ సంవత్సరంలో రాజశేఖర్ మగాడు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలో జీవిత దగ్గరుండి రాజశేఖర్ కు ఎన్నో సేవలు చేయడంతో రాజశేఖర తల్లిదండ్రులు కూడా వీరికి వివాహం చేస్తే బాగుంటుందని ఊహించి వీరిద్దరికి వివాహం చేశారు.