బుల్లి గౌనులో కాజ‌ల్ టెంప్టింగ్ ఫోజులు.. ఒక‌ బిడ్డ‌కు త‌ల్లంటే అస్స‌లు న‌మ్మ‌రు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. 2020లో ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.

 

పెళ్లి అయిన కొద్ది నెల‌ల‌కే గ‌ర్భం దాల్చిన కాజ‌ల్‌.. న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చి గ‌త ఏడాది పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మించింది.

బిడ్డ పుట్టిన మూడు నెల‌ల త‌ర్వాత ఫిట్ నెస్ పై శ్ర‌ద్ధ పెట్టి మ‌ళ్లీ మునుప‌టి రూపంలోకి మారింది.

దీంతో కాజ‌ల్ కు ఆఫ‌ర్లు రావ‌డం ప్రారంభం అయ్యాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భార‌తీయుడు 2`లో న‌టిస్తోంది.

అలాగే న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న `ఎన్‌బీకే 108`లో ఎంపిక అయింది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌లు ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కాజ‌ల్ తాజాగా ఫోటో షూట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

మోకాళ్ల పైకి ఉన్న పింక్ కలర్ బుల్లి గౌనులో అందంగా ముస్తాబై సూప‌ర్ టెంప్టింగ్ ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది.

ఈ పిక్స్ నెటిజ‌న్లు తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. ఒక బిడ్డ‌కు త‌ల్లంటే అస్స‌లు న‌మ్మ‌రు. అంత‌లా త‌న లుక్‌, ఫిజిక్ తో కాజ‌ల్ ఎట్రాక్ట్ చేస్తోంది.