ఆర్ఆర్ఆర్ తో పాటు `ఆస్కార్` అందుకున్న మ‌రో ఇండియ‌న్ మూవీ ఏదో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్కార్ అవార్డు వరించిన సంగ‌తి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ అవార్డ్ ను ద‌క్కించుకుంది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు.

అయితే `ఆర్ఆర్ఆర్`తో పాటు మ‌రో ఇండియ‌న్ మూవీ కూవా ఆస్కార్ అవార్డును అందుకుంది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ లభించింది. `ది ఎలిఫెంట్ విస్పరర్స్` ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రాన్ని కార్తిక్ గోన్సాల్వేస్ డైరెక్ట్ చేయగా, గునీత్ మోంగా నిర్మించింది. ఇక సంప్రదాయ దుస్తుల్లో కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్‌ మోంగా అవార్డ్ అందుకున్నారు.

యంగ్ లేడీ డైరెక్ట‌ర్ కార్తీకి గాన్సాల్వేస్ మొదటి చిత్రంతోనే ఇటువంటి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును అందుకుని రికార్డు సృష్టించింది. ఒంటరైన ఏనుగు పిల్లతో ఒక కుటుంబానికి మధ్య బాండింగ్ హృద్యంగా చెప్పి కార్తీకి అకాడమీ మెంబర్స్ ని మెప్పించారు. దిగ్గజ చిత్రాలతో పోటీపడి ఆస్కార్ గెలుచుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.