బాబోయ్‌.. ఇక నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రిగిందంటే?

`పుష్ప‌`.. 2021లో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలోని పాటలు మాస్‌ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేశాయి.

స‌మంత చేసిన `ఊ అంటావా ఊ ఊ అంటావా` త‌ర్వాత బాగా ఫేమ‌స్ అయిన పాట‌ల్లో `సామి సామి` ముందు వ‌ర‌స‌లో ఉంది. ముఖ్యంగా ‘సామి సామి’ పాటలో రష్మిక స్టెప్పులు అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో పుష్ప విడుదల తర్వాత ఎక్కడకు వెళ్లినా, ఏ ఈవెంట్‌కు హాజరైనా అభిమానులు రష్మికను ‘సామి సామి’ స్టెప్‌ వేయమని అడిగేవారు. ర‌ష్మిక సైతం కాద‌న‌లేక స్టెప్పులు వేసేది.

తాజాగా కూడా ఇలాంటి ప‌రిస్థితే ర‌ష్మిక‌కు ఎదురైంది. తాజాగా సోష‌ల్ మీడియా చిట్ చాట్ లో `సామి సామి పాటకు మీతో కలిసి డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నా. చేయొచ్చా..?` అంటూ ఓ ఫ్యాన్ రష్మికను అడ‌గ‌గా.. బాబోయ్, ఇక నా వ‌ల్ల కాదంటూ చేతులెత్తేసింది ర‌ష్మిక‌. `సామి సామి స్టెప్‌ను ఇప్పటికే ఎన్నోసార్లు చేశా. ఇలాగే ఆ స్టెప్‌ వేస్తూవుంటే నేను ముసలిదాన్ని అయ్యాక నా నడుములో సమస్యలు వస్తాయేమో.` అంటూ బ‌దులిచ్చింది. సామి సామి స్టెప్ కాకుండా ఇంకైదేనా ట్రై చేద్దామ‌ని ర‌ష్మిక స‌మాధానం చెప్పింది.