టూ పీస్ బికినీలో బాల‌య్య భామ ర‌చ్చ‌.. బాబోయ్ మ‌రీ బ‌రితెగించేసిందిగా!

కెరీర్ ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన `అఖండ` సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ దశ తిరిగినట్టే అని అందరూ అనుకున్నారు.

కానీ, అలా జరగలేదు. అఖండ తర్వాత ప్రగ్యా నుంచి మరో సినిమా రాలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూసి అటు అభిమానులు ఇటు నెటిజ‌న్లు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే టూ పీస్ బిగినీలో యమా హాట్ గా దర్శనమిచ్చింది. బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేసింది.

ప్ర‌గ్యా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. కొందరు నెటిజ‌న్లు ప్ర‌గ్యా మ‌రీ బ‌రితెగించేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమె అందాలపై కవితలు అల్లేస్తున్నారు.

Share post:

Latest