నాని దసరా మూవీ రివ్యూ.. సక్సెస్ అయినట్టేనా..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల అయింది హీరో నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. స్టార్ హీరో రేంజ్కి ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం మీడియం రేంజ్ బడ్జెట్లలో సినిమాలు చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. నాని ఆ రేంజ్ నుండి స్టార్ రేంజ్ కి ఎదిగి..ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ నుంచి మొదలు నేటి వరకు ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ తో తప్ప నెగటివ్ ఎక్కడ కనిపించలేదు. అందుకు తగ్గట్టుగానే టీజర్ ,ట్రైలర్ పాటలు కూడా ఈ సినిమా పైన బాగా అంచనాలను పెంచేసాయి.. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని షోలు ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ షో నుంచి వచ్చిన టాక్ పరిశీలిస్తే చిత్రం నాని మరొక లెవల్ కి తీసుకు వెళుతుందని తెలియజేస్తున్నారు ఇందులో ఆయన నటన అభిమానుల సైతం ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట అంతేకాకుండా మాస్గా అంత రుస్టిక్ గా ఉంటుందని తెలియజేశారు.

చాలా సన్నివేశాలలో నాని నటనకు రోమాలు నిక్క పొడుస్తాయట కొన్ని సన్నివేశాలు మనకు తెలియకుండానే బాగోద్వేగానికి లోనైపోతున్నాయని తెలిపారు. కేవలం నాని మాత్రమే కాకుండా హీరోయిన్ కూడా ఇందులో అద్భుతంగా నటించిందని.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కచ్చితంగా టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అవుతారని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఓవరాలిగా ఈ సినిమా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

https://twitter.com/ShivaKumar0110/status/1641217643679039489?s=20