అంద‌రూ విజ‌య్ గురించే అడిగితే చెప్పలేక చ‌చ్చేదాన్ని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ గురించి ప్ర‌ముఖ హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభం నుంచి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను ఎంచుకుంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న మాళ‌విక‌.. త్వ‌ర‌లోనే `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతోంది.

 

నాగశౌర్య హీరోగా న‌టించిన ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మాళ‌విక ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

 

మాళ‌విక తొలి సినిమా `ఎవడే సుబ్రహ్మణ్యం`. ఇందులో నాని హీరోగా న‌టిస్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌క పాత్ర‌ల‌ను పోషించాడు. ఈ సినిమా స‌మయానికి మాళ‌విక వ‌య‌సు 17ఏళ్లు. ఈ బ్యూటీ ఓవైపు చ‌ద‌వుకుంటూనే.. మ‌రోవైపు సినిమాలు చేసింది. అయితే ఢిల్లీలో ఇంటర్ తర్వాత హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలో త‌న స్నేహితులంతా విజయ్‌ దేవరకొండ గురించే అడిగేవారని తాజాగా మాళవిక చెప్పుకొచ్చింది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోయేదాన్ని.. కానీ, విజ‌య్ పెద్ద స్టార్ అవ‌డం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌ని మాళ‌విక తెలిపింది. ఇక ఎవడే సుబ్రమణ్యం తర్వాత టాక్సీవాలా మూవీలోనూ విజ‌య్ తో న‌టించిందీ బ్యూటీ.

Share post:

Latest