జ్యోతిక సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇంట్లో వారిని ఎదురించి ఆ ప‌ని చేస్తుందా?

కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య సతీమణి, ప్రముఖ నటి జ్యోతిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక.. సూర్యను వివాహం చేసుకున్న తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి.. కొన్నాళ్లపాటు ఇంటి బాధ్యతలను చూసుకుంది. ఇక పిల్లలు పెద్దవారు కావడంతో మళ్ళీ కెరీర్ పై దృష్టి సారించింది.

 

ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తూ నటిగా సత్తా చాటుతోంది. అలాగే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తోంది. తాజాగా జ్యోతిక మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌ని ఈమె డిసైడ్ అయిందట‌. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తో కలిసి హిందీ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఫర్హాన్ అక్త‌ర్‌, రితేష్ సద్వానీ ఓ వెబ్ సిరీస్ నిర్మించనున్నారు.

ఐదు గృహిణులు ఓ బిజినెస్ ను మొదలు పెట్టినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నదే ఈ వెబ్ సిరీస్ కథాంశం. సోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో ఓ కీల‌క పాత్ర కోసం జ్యోతిక‌ను తీసుకున్నార‌ట‌. సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ట‌. అయితే జ్యోతిక మళ్లీ న‌టించ‌డం సూర్య తండ్రి బైల్వాన్ రంగనాథన్ కి ఇష్టం లేదని.. ఈ కార‌ణంగానే ఇంట్లో గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని మొన్నామ‌ధ్య ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ, భ‌ర్త స‌పోర్ట్ గా ఉండ‌టంతో జ్యోతిక ఇంట్లో వారిని ఎదురించి సినిమాలు చేస్తుంద‌ని టాక్‌. ఇక ఇప్పుడు డిజిట‌ల్ ఎంట్రీ కూడా రెడీ అయింది.

Share post:

Latest