అతనితో డేటింగ్ ఉన్నానంటూ షాక్ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత..!!

నచ్చావులే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత.. స్నేహితుడా అరవిందు-2 వంటి చిత్రాలలో నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి చిత్రంలో హీరోయిన్స్ స్నేహితురాలి పాత్రలో మొట్టమొదటిసారిగా కనిపించింది.ఆ తర్వాత ఇమే మరి ఎక్కడ కనిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది అది వైరల్ గా మారుతోంది.

Madhavi Latha - IMDb

ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానంటే ఫేస్బుక్ ద్వారా తెలియజేసింది మాధవి లత.. మాధవి లత తన ఫేస్బుక్లో ఒక పేజీని రాసుకోస్తూ నేను ఒక వ్యక్తిని కలిశాను ముందు అతడిని అర్థం చేసుకున్నాను ఆ తర్వాత రెండు వైపులా తల్లిదండ్రుల అనుమతి పొందాలని నిర్ణయించుకున్నాను.. ఇది అంత త్వరగా జరిగే పని కాదు మరో ఏడాది సమయం పట్టవచ్చు అతని వివాహం చేసుకుంటాను లేదో మీకు తప్పకుండా చెబుతాను అంటూ పెళ్లి తేది గురించి మాత్రం అసలు అడగద్దు అంటూ తెలియజేసింది.

అయితే అతడు తెలుగు వ్యక్తి అయితే కాదు నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తిని వివాహం చేసుకుంటాను ఆ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. 2018లో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది మాధవి లత బిజెపిలో చేరి గత ఎన్నికలలో పోటీ చేయడం కూడా జరిగింది. మాధవి లత అప్పుడప్పుడు ఏదైనా వ్యక్తిగత విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది.