ఆ న‌టి రాత్రికి ర‌మ్మంది.. బిగ్ బాంబ్ పేల్చిన `రేసుగుర్రం` విల‌న్‌!

కాస్టింగ్‌ కౌచ్‌.. సినీ ఇండ‌స్ట్రీలో త‌ర‌చూ వినిపించే పేరు ఇది. పేరుమోసిన హీరోయిన్లు కూడా తాము కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆఫ‌ర్లు కావాలంటే ప‌క్క‌లోకి ర‌మ్మ‌న్నార‌ని బ‌హిరంగంగా త‌మకు ఇండ‌స్ట్రీలో ఎదురైన‌ చేదు అనుభ‌వాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.అయితే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చాడో న‌టుడు.

ఇంత‌కీ అత‌నెవ‌రో కాదు రవికిషన్. భోజ్‌పురి సీనియర్ న‌టుడు, బీజేపీ ఎంపీ అయిన‌ రవికిషన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అల్లు అర్జున్ హిట్ మూవీ `రేసుగుర్రం`లో రవికిషన్ విలన్ గా న‌టించి మెప్పించాడు. అలాగే తెలుగులో మ‌రిన్ని సినిమాలు కూడా చేశాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌వికిష‌న్‌.. ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్‌లో ఉన్న ఓ నటి తనను ఇబ్బంది పెట్టిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

`సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఓ నటి రాత్రి మనం కాఫీకి వెళ్దాం అని పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా కాఫీ పగటి పూట తాగుదామంటారు. కానీ ఆమె రాత్రి రావాలని ప్రత్యేకంగా చెప్పడంతో నాకు అనుమానం వచ్చి వెంటనే నో చెప్పాను. ప్ర‌స్తుతం ఆమెకు సొసైటీలో మంచి పేరు ఉంది. కాబ‌ట్టి ఆమె పేరు చెప్పదలచుకోవడం లేదు. ఇక అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని మా నాన్న నాకు నేర్పించారు. అందుకే నేను నా టాలెంట్ నే న‌మ్ముకుని న‌టుడిగా ఎదిగాను` అంటూ ర‌వికిష‌న్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.