కీర్తి సురేష్ అలా చేయడం అతనికి అసలు నచ్చలేదట.. ఎవరంటే..?

హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం దసరా. ఈ చిత్రం మరో కొద్దిరోజుల్లో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో వెన్నెల పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంలో ఈమేను చూసి ఫాన్స్ మైమరిచిపోతున్నారు. అయితే ఈ సినిమా డిస్కషన్ లో ఉన్నప్పుడు కీర్తి సురేష్ వద్దని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెలియజేశారట. కథ విన్న తర్వాత నాని హీరోయిన్గా కీర్తిని తీసుకుందామని రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య ఆమె చాలా బక్కగా మారిపోయిందని సినిమాలో వెన్నెల పాత్ర కొద్దిగా లావుగా ఉండాలని చెప్పారట డైరెక్టర్ శ్రీకాంత్.

అయితే ఈ సినిమా కోసం కీర్తి సురేష్ కొద్దిగా లావు పెరగాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. కీర్తి ముందు కాదన్న శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత ఆమె పాత్రను అభినయించిన తీరును చూసి ఆమె ప్రేమలో పడ్డారని నాని తెలియజేయడం జరిగింది. మొత్తానికి కీర్తి సురేష్ బక్కగా మారడం దసరా డైరెక్టర్ కి అసలు నచ్చలేదని తెలియజేశారు. అయితే ఇదంతా కేవలం డైరెక్టర్ అభిప్రాయమే కాదని మహానటి సినిమాలో ఆమెను చూసిన తీరు చాలామంది అభిమానులకు అది అభిప్రాయాన్ని కలిగించిందని తెలిపారు.

Keerthy Suresh rides a Bajaj scooter in wholesome BTS pics from Dasara -  Hindustan Times

మహానటి చిత్రంలో కనిపించిన కీర్తి సురేష్ ఆ తర్వాత జీరో సైజ్ మోజుల పడి బాగా తగ్గిపోయిందని అయితే ఆమెను బక్కగా చూసిన అభిమానులు కాస్త నిరుత్సాహ చేందారని..బరువు తగ్గడం వల్ల ఆమె ఫేస్ లో కల కూడా పోయిందని వార్తలు వినిపించాయి. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం తన సినిమాలలో నటిస్తూనే ఉన్నది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించినట్లు తెలుస్తోంది.