ఆ స్టార్ హీరోయిన్ సోదరి తరుణ్ ను ప్రేమించిందా..!!

తెలుగు ప్రేక్షకులకు హీరో తరుణ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 15 ఏళ్ల క్రితం తరుణ్ కు మంచి క్రేజ్ ఉండేది. తరుణ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచేవి. అప్పట్లో హీరో తరుణ్ శ్రీయ, త్రిష, ఆర్తి అగర్వాల్ తదితర హీరోయిన్లతో తీసి లవర్ బాయ్ గా కూడా పేరు పొందారు. వాస్తవానికి హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ మధ్య ఏదో ఉందని వార్తలు కూడా అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. అయితే ఆర్తి అగర్వాల్ మాత్రం కొన్ని కారణాల చేత చిన్న వయసులోనే మరణించింది.

వాస్తవానికి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదట. కేవలం అమెరికాలో తనను చూసిన నిర్మాత సురేష్ బాబు నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ఈమెకు అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత తన సినీ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది. నువ్వు లేక నేను లేను ,నీ స్నేహం ,ఇంద్ర తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఆర్తి అగర్వాల్ తరుణ్తో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈమెకు ఒక సోదరి కూడా ఉంది.

ఆర్తి అగర్వాల్ చెల్లెలు గంగోత్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె పేరు అదితి అగర్వాల్.

ఈమె కూడా తరుణ్ను ప్రేమించిందట. అప్పట్లో వీరందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్లే వారిని సమాచారం. అలా ఒకసారి ఆర్తి అగర్వాల్ ,అతిథి, తరుణ్ ఒక రెస్టారెంట్ కు వెళ్లగా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నట్లు సమాచారం.. అంతలో ఆర్తి అగర్వాల్ వాష్ రూమ్ కు వెళ్ళగా అక్క వాష్ రూమ్ కి వెళ్ళగానే తరుణ్ తో క్లోజ్ గా మువ్ అయిందట అదితి అగర్వాల్. తరుణ్ తో ఆమెను చూసి ఆర్తి వెంటనే అక్కడి నుంచి అతిధి చంప చెల్లుమనిపించిందట.దీంతో తరుణ్ మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పవచ్చు. తరుణ్ తనను కాదన్నాడని తను చాలా డిప్రెషన్ అయ్యిందట. ఆ తర్వాత వేరే వివాహం చేసుకుంది. దీంతో అమెరికాలోని స్థిరపడి ఒక సర్జరీ కూడా చేయించగా అది వికటించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

Share post:

Latest