2వ రోజు కూడా దుమ్ము లేపిన `ధ‌మ్కీ`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన `దాస్ కా ధ‌మ్కీ` చిత్రం తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించారు.

ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా స‌రే టాక్ తో సంబంధం లేకుండా విశ్వ‌క్ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేశాడు. పండగ అడ్వాంటేజ్ తో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏకంగా రూ. 3.06 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది.

అలాగే రెండో రోజు కూడా దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1.45 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా దాస్ కా ధ‌మ్కీ 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.47 కోట్లు
సీడెడ్: 59 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 53 ల‌క్ష‌లు
తూర్పు: 36 ల‌క్ష‌లు
పశ్చిమ: 23 ల‌క్ష‌లు
గుంటూరు: 45 ల‌క్ష‌లు
కృష్ణ: 29 ల‌క్ష‌లు
నెల్లూరు: 19 ల‌క్ష‌లు
——————————————
ఏనీ+తెలంగాణ‌= 4.11 కోట్లు(7.70 కోట్లు~ గ్రాస్‌)
——————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 60 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 82 ల‌క్ష‌లు
——————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్‌ కలెక్షన్స్ = 5.53 కోట్లు(11.00 కోట్లు~ గ్రాస్)
——————————————-

కాగా, రూ. 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఇంకా రూ. 2.47 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ టార్గెట్ ను విశ్వ‌క్ ఈజీగా రీచ్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.