వారంతా నన్ను నా కూతుర్ని చిత్రహింసలు పెట్టారు.. నటి..?

తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లో అటు వెండితెరపై కూడా దాదాపుగా 600కు పైగా చిత్రాలలో నటించిన మంచి పాపులారిటీ సంపాదించింది సనా బేగమ్.. తాజాగా రంగమార్తాండ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించింది ఈమె. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది తన జీవితంలో జరిగిన కొన్ని చేదు ఘటనలను కూడా తెలియజేసింది.

Shanoor Sana Begum Wiki, Age, Height, Husband, Family, Biography & More -  WikiBio

మొదట యాడ్ షూటింగ్స్ నుంచి తన ప్రయాణం మొదలయ్యింది .. నాకు మా అత్తమామయ్య సపోర్టు చాలానే ఉందని తెలుపుతోంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి మీ కోడలు ఇలా చేస్తోంది? ఎక్కడికి వెళుతున్నారు ఇలా ఎన్నో మాటలన్నారు.. కానీ వారు ఆ మాటలని అసలు లెక్క చేయలేదు.. నాకు హీరోయిన్ ఛాన్సులు కూడా వచ్చాయి కాకపోతే వివాహం అయ్యింది పిల్లలు ఉన్నారనే విషయాన్ని చెప్పొద్దన్నారు. స్విమ్ సూట్ వేసుకోవాలి ..ఎక్స్పోజింగ్ చేయాలని అలా అయితే అవకాశాలు వస్తాయని చెప్పడంతో ఆ అవకాశాలను తిరస్కరించారని తెలుపుతోంది.

Telugu Actress Shanoor Sana Begum Images, Age, Photos, Family, Biography.

కన్నడలో ఇతర భాష నటీనటులను పెద్దగా ఒప్పుకోరు. సైనిక సినిమా షూటింగ్లో పెద్దపెద్ద డైలాగులు చెప్పే సన్నివేశాలు ఉన్నాయి. నేను కూర్చొని డైలాగులు చెబుతూ ఉండేదాన్ని అంటూ తెలుపుతోంది. కరోనా తరువాత వర్మ తీసిన ఒక హిందీ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నాను. అక్కడ జారి కిందపడి చేతికి ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయడంతో మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుపుతోంది.

Shanoor Sana Wiki - coolaload

తన కూతురికి కూడా చిన్న వయసులోనే సినిమా అవకాశాలు వచ్చాయి.. కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వాటిని వదిలేసింది.. ప్రస్తుతం ఆమె యొక్క యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది అని తెలుపుతోంది. తన కూతురికి వివాహమయ్యాక ఎన్నో కష్టాలు అనుభవించింది. తన కుటుంబమంతా ఆమెను దుబాయ్ తీసుకువెళ్లి టార్చర్ చేశారు.. తిండి కూడా పెట్టే వాళ్ళు కాదు అలా నరకం చూసాము తన బంగారం డబ్బులు అంతా వాడుకొని ఆమెను మోసం చేశారని తెలుపుతోంది సనా బేగమ్. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ తనకు చెప్పలేదని తెలుపుతోంది. దీంతో తన కూతురు విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన పిల్లోడిని పోషిస్తూ ముందుకు వెళుతోందని సనా తెలుపుతోంది.