నిహారిక ఫోటోల‌న్నీ తొల‌గించిన చైత‌న్య‌.. ఆ ఒక్క‌టి ఎందుకు ఉంచాడు?

మెగా డాట‌ర్ నిహారిక మూడేళ్ల కిందట గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో నిహారిక‌, చైత‌న్యల వివాహం ఎంతో వైభవంగా జ‌రిగింది. అప్ప‌ట్లో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అయితే మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అన్న‌ట్లు ఉండే ఈ జంట అనూహ్యంగా విడాకులు వైపు ట‌ర్న్ తీసుకున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా గ‌త కొద్ది రోజుల నుంచి నిహారిక‌, చైత‌న్య విడివిడిగా ఉంటున్నార‌ని.. త్వ‌ర‌లోనే అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో నిహారిక, చైతన్య చేసిన పని విడాకుల వార్త‌ల‌కు మరింత బ‌లాన్ని ఇచ్చినట్టయింది.

ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే చైతన్య త‌న ఇన్‌స్టాలో నిహారికతో క‌లిసి దిగిన ఫోటోలు, పెళ్లి ఫోటోలు అన్నీ కూడా తొల‌గించాడు. దీంతో, ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే నిహారిక ఫోటోల‌న్నీ తొల‌గించిన చైత‌న్య‌.. ఒక్క‌టి మాత్రం అలానే ఉంచాడు. తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రైవ‌ర్ జాతికి చెందిన కుక్క‌పిల్ల బ‌జ్‌తో నిహారిక దిగిన పిక్ ఇది. 2020లో ఈ పిక్ ను అప్లోడ్ చేశాడు. అయితే అన్నిటిని తొలగించిన చైతు.. ఈ ఒక్క పిక్ ను మాత్ర‌మే ఎందుకు ఉంచాడు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

https://www.instagram.com/p/CI77kZKHdHh/?utm_source=ig_web_copy_link