కీర్తి మనసు బంగారం.. ఆ టెక్నీషియళ్లకు కళ్ళు చెదిరే గిఫ్ట్స్ ఇచ్చింది!!

నేచరల్ స్టార్ నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దసరా సినిమాలో నేచరల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ‘నేను లోకల్’ సినిమా తరువాత నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో రానున్న రెండవ సినిమా దసరా. ఈ సినిమా వారిద్దరికీ మర్చిపోలేని చిత్రంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేష్ దసరా సినిమాకి సంబందించిన సాంకేతిక నిపుణులకు బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చింది. ఈ సినిమాకి సహాయపడిన లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ లాంటి సాంకేతిక నిపుణుల కృషి చూసి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. గతంలో కూడా కీర్తి సురేష్ నటించిన మహానటి చిత్ర టీమ్ కి కూడా ఆమె గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ విషయంలో కీర్తి సురేష్‌ను ఎంతగానో ప్రశంసించారు. కీర్తి మనసు బంగారం అని పొగిడారు.

ఇకపోతే కీర్తి సురేష్ గత కొంతకాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటుంది. ఇప్పుడు మళ్లీ హీరోల సరసన నటిస్తూ లైన్ లైట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాటలో మహేష్ తో కెమిస్ట్రీ బాగానే పండించి హైలెట్ అయింది.

Share post:

Latest