రాజకీయాలకు మోహన్ బాబు స్వస్తి చెప్పినట్టేనా..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి మనం ఎంత చెప్పినా తక్కువే..మొదట పలు చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా ,విలన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా కూడా పలు చిత్రాలలో నటించారు. మరొకవైపు విద్యాసంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు మోహన్ బాబు. నిన్నటి రోజున మోహన్ బాబు 71వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు .ఈ పుట్టినరోజు వేడుకలలో సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Mohan Babu: 2010 cheque bounce case: Mohan Babu sentenced to 1-year  imprisonment, asked to pay Rs 41.75 lakh fine

ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు తన సినీ రాజకీయ ప్రస్థానం గురించి తెలియజేయడం జరిగింది.. విలేకరు మోహన్ బాబును ప్రశ్నిస్తూ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత మీకు ఏ విషయంలో రాజకీయాలపై విరక్తి కలిగించేలా చేసిందని ప్రశ్నించాగా.. అందుకు మోహన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం అదంతా గతం గతః.. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నేను కూర్చొను నన్ను రాజకీయాలలో మోసం చేశారు..అయితే నన్ను వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని నేను ఎప్పుడూ చెప్పను..

ఇక అన్న ఎన్టీఆర్ నన్ను ఆ కాలంలోనే రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నేను ముక్కుసూటితనంగా వ్యవహరించే తీరు రాజకీయాలకు పనికిరాదని నేను వెనక్కి తగ్గానని తెలిపారు. రాజకీయాలలో ప్రత్యర్థులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయాలి అప్పుడే మనం రాజకీయాలలో ఉండగలం లేకపోతే రాజకీయ సన్యాసం తప్పనిసరి అంటే తెలిపారు. అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తనను ఎవరు రాజకీయాలలో వెనక్కి లాగలేదంటూ తెలియజేశారు మోహన్ బాబు. దీన్ని పట్టి చూస్తే ఇక మీదట మోహన్ బాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టే అంటూ అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ విషయం
వైరల్ గా మారుతోంది.

Share post:

Latest