సౌంద‌ర్య త‌ర్వాత వెంకీని అంత‌లా ఇష్ట‌ప‌డిన హీరోయిన్ ఎవరు.. ఎందుకు…?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ అంటే అన్నీ వర్గాల ప్రేక్ష‌కుల‌లో ఎంతో క్రేజ్ ఉంది. ఎక్కువగా కోలీవుడ్‌తో పాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తుండటం వల్ల వెంకీకి అటు తమిళం అలాగే మిగతా సౌత్ భాషలలో కూడా ఆయనకి అభిమానులు ఎక్కువే. వెంకీ నటించిన సినిమాలలో ఎక్కువగా సూపర్ హిట్స్ ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే, ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలే కాదు క్రేజ్ కోసం హీరోయిన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువ్వగా వెంకీతో క‌లిసి న‌టించిన హీరోయిన్ ఎవ‌రు అంటే సౌందర్య అని చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. ఇక ఈ జంట‌కి హిట్ పేయిర్ అనే పేరు కూడా ఉంది. ఆ తర్వాత వెంకీ సరసన సిమ్రాన్ బాగా పాపులర్ అయింది.

Prematho Raa - Alchetron, The Free Social Encyclopedia

ఇక వీరిద్దరి తర్వాత వెంకీతో కలిసి నటించాలనే ఆరాటం ఎక్కువగా తమిళ కుట్టీ త్రిష కృష్ణన్‌కి ఉండేది. వీరి కాంబినేషన్‌లో నమో వేంకటేశ, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే వంటి హిట్ సినిమాలు వచ్చాయి. వెంకీ పక్కన త్రిష పర్‌ఫెక్ట్ పేయిర్ అని చెప్పుకున్నారు. ఇప్పటికీ త్రిషలో తరగని అందం సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు ఉన్నాయి. 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది.

Trisha-Venkatesh: ఆ హీరోలో త్రిషకి అది బాగా నచ్చిందా.. అందుకే మళ్ళీ ఆ పని  ఒక్కసారైనా చేయాలని..!! - PakkaFilmy

ఇంకా త్రిషలో అదే ఛార్మ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వెంకీ సరసన నటించాలని ఈ బక్క పలచని అందాల‌భామ ఎదురుచూస్తోంది. ప్రియమణి, మీనా, శ్రీయ వంటి భామ‌ల‌కు రెండు, మూడు సినిమాల‌కు పైన‌ అవకాశాలిచ్చిన వెంకటేష్ ఇప్పుడు త్రిషకి మరోసారి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. త్రిష లేటెస్ట్ ఫొటో షూట్స్ చూస్తే కుర్ర హీరోలకి సరిపోయే ఫిజిక్కే అనుకోవచ్చు. కాబట్టి ఏ హీరో అయినా ఇప్ప‌టికి కూడా త్రిషతో రొమాన్స్ చెయవచ్చు.