శ్రీ‌జ‌కు దూరం కావ‌డానికి కార‌ణం అదేనా.. ఒక్క పోస్ట్ తో కళ్యాణ్‌ దేవ్ క్లారిటీ!?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ కొణిదెల చాలా రోజుల నుంచి భ‌ర్త‌, ప్ర‌ముఖ హీరో క‌ళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది. కొన్ని నెల‌లుగా క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీ‌జ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని.. దాంతో వీరిద్ద‌రూ విడాకులు తీసుకుని విడిపోయార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ మొదలు అయ్యాయి. అలాగే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం ఈ వార్తలకి బలాన్నిచ్చింది. ఈ వార్త‌లపై ఇప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీ‌జ స్పందించ‌లేదు. అలా అని ఖండించ‌నూ లేదు. దీంతో వీరిద్ద‌రి డివోర్స్ నిజమే అని జనం నమ్ముతున్నారు.

అయితే తాజాగా శ్రీ‌జ‌కు దూరం కావ‌డానికి కార‌ణం ఏంటో క‌ళ్యాణ్ దేవ్ ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే క‌ళ్యాణ్ రామ్‌.. తాజాగా ఓ పోస్ట్ లో `ఎదుటి వాళ్లు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం` అంటూ రాసుకొచ్చాడు. దీంతో కళ్యాణ్ దేవ్ ను శ్రీ‌జ చుల‌క‌న‌గా చూస్తూ మెగా ఫ్యామిలీలో అవ‌మానించిందా..? అందుకే ఆమెతో విడిపోయాడా..? అంటూ నెటిజ‌న్లు చ‌ర్చ‌లు ప్రారంబించారు.