చెప్పుతో కొడతా.. త‌మ్ముడికి ప‌బ్లిక్ గా వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌!

ఓవైపు బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా స‌త్తా చాటుతున్న అన‌సూయ‌.. మరోవైపు న‌టిగా వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచుగా గ్లామ‌ర‌స్ ఫోటోషూట్లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తనను ట్రోల్ చేసే నెటిజ‌న్ల‌కు తనదైన శైలిలో ఏకిపారేస్తూ కూడా ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ తమ్ముడికి సోష‌ల్ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చింది. అసలేం జ‌రిగిందంటే.. వాలెంటైన్స్ సందర్భంగా అనసూయ భర్తతో దిగిన ఫోటో షేర్ చేశారు.

సదరు ఫొటోకు `నీతో జీవితం రోలర్ కోస్టర్ రైడ్ వంటిది` అని కామెంట్ చేశారు. అయితే ఆమె పోస్ట్ కు ఓ నెటిజ‌న్ `అదేం లేదులే అక్కా వాడి దగ్గర బాగా డబ్బుంది, దట్స్ ఇట్` అని కామెంట్ చేశాడు. దాంతో అన‌సూయ‌కు ఎక్కుడో మండింది. వెంట‌నే ‘అదేంట్రా తమ్ముడు అంత మాట అనేశావ్. డబ్బేమిట్రా? ఎంత ఉందేంటి? అక్క దగ్గరలేదా డబ్బు ? అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేవి కూడా ఉన్నాయేంట్రా? బావగారికి పట్టుకొని వాడు వీడు ఏంట్రా మర్యాద లేకుండా. ఏం పెంపకంరా తమ్ముడు నీది. చెంపలు వేసుకో, లేదంటే నేనే చెప్పుతో కొడతా..` అని ఘాటైన సమాధానం ఇచ్చింది.

సదరు నెటిజన్ తిరిగి `సమర్ధించుకోకు. రియాలిటీ మాట్లాడు. నీ భవిష్యత్ భద్రత కోసం ఒక డబ్బున్న వాడిని పెళ్లి చేసుకున్నావ్ అనే అర్థంలో అన్నాను` అంటూ మ‌రో కామెంట్ పెట్టాడు. అందుకు అన‌సూయ ‘నీ బొందరా నీ బొంద… అన్నీ తెలిసిన అంతర్యామిలా మాట్లాడకు. ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో. పచ్చ కామెర్లు ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీకు డబ్బు పిచ్చి, ఇక అందరూ అదే అనుకుంటున్నావు. నీ బుద్ధి మార్చుకో. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా నీ మంచికే చెబుతున్నా..` అంటూ మరో రిప్లై ఇచ్చింది. మొత్తానికి వీరి గొడ‌వ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/p/CoolDcJLzdC/?utm_source=ig_web_copy_link