టాప్ లిస్టు లోకి చేరిపోయిన వాల్తేర్ వీరయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్లో కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు కలెక్షన్లు భారీగానే వసూలు చేస్తూ ఉంటాయి. ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ కూడా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొని సక్సెస్ కానీ హీరోలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా రాబట్టే చిత్రాలు చాలా ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఇలా రిలీజ్ చేయడం ద్వారా ఒక్కో భాషలో ఒక్కోచిత్రం క్లిక్ అవుతూ నిర్మాతలకు మంచి లాభాలను తెస్తున్నాయి.

Waltair Veerayya Twitter review: 'Chiranjeevi in form, but movie lacks  punch,' says public - BusinessTodayమీడియం రేంజ్ హీరోలు కూడా యూనివర్సల్ అప్పీల్స్ ఉన్న పాన్ ఇండియా కథ లనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇక అలాంటి కథలని తెలుగులో కూడా భారీగానే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగులో హైయెస్ట్ కలెక్షన్ గా సాధించిన సినిమాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలలో రూ .415 కోట్ల గ్రాస్ వసూలు చేసి..RRR చిత్రం నిలిచింది రెండవ స్థానంలో బాహుబలి -2 రూ.330 కోట్లు కలెక్షన్ చేసింది మూడో స్థానంలో అలా వైకుంఠపురం సినిమా రూ.203 కోట్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ తర్వాత మెగాస్టార్ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా నిలవడం గమనార్హం. రూ.186.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి తెలుగు రాష్ట్రాల నుంచి మంచి కలెక్షన్లు రాబట్టింది. కేవలం తెలుగులోనే విడుదలైన ఈ సినిమా ఇంతటి కలెక్షన్లు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆ తరువాత సరిలేరు నీకెవరు సినిమా రూ.177.70 కోట్లు బాహుబలి రూ.175.40 కోట్లతో ఉన్నాయి ఇందులో హైయెస్ట్ క్రాస్ కలెక్షన్లు చేసిన సినిమాల జాబితాలు రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ఉండగా మిగిలినవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు కావడం విశేషము. కానీ ఇందులో పుష్ప చిత్రం లేకపోవడం జరుగుతోంది.