ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయిన‌ సునీత.. ఏం చెప్పిందంటే?

ప్రముఖ గాయని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత రెండో పెళ్లి ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తన గాత్రంతో అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత.. 2021 ఆరంభంలో ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో ఏడ‌డుగులు వేసింది. ఇది వీరిద్ద‌రికీ రెండో వివాహ‌మే.

ఘనంగా జరిగిన వీరి వివాహ వేడుక‌కు క‌రోనా కార‌ణంగా చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అయితే పెళ్లి వ‌య‌సుకు వ‌చ్చిన కొడుకు, కూతురు ఉండ‌గా సునీత రెండో వివాహం చేసుకోవ‌డం ప‌ట్ల కొంద‌రు ఆమెను త‌ప్పుబ‌ట్టారు. మ‌రికొంద‌రు ఆమెకు స‌పోర్ట్ గా నిలిచారు. మొత్తానికి ప్ర‌స్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున సునీత‌.. త‌న ఇద్దరు పిల్లల్ని సెటిల్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సునీత ప్రెగ్నెంట్ అంటూ గ‌త కొద్ది రోజుల ఉంచి త‌ర‌చూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయింది సునీత. ఓ ఈవెంట్ లో `మీరు తల్లయ్యారంటూ ఒక ప్రచారం జరుగుతుంది… దీనికి మీ స్పందన ఏంటి? అని ప్ర‌శ్నింగా.. `ఈ పుకారు నా వరకు రాలేదు. నేను తల్లిని అయ్యానంటూ రూమర్ సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం ఇది. నాకు గానీ, నా జీవితానికి గానీ సంబంధించింది కాదు` అంటూ పరోక్షంగా ప్రెగ్నెంట్‌ వార్తలను సునీత ఖండించింది.