అనుప‌మ పిచ్చిగా ప్రేమిస్తూ వెంట‌ప‌డుతున్నా ప‌ట్టించుకోని టాలీవుడ్ హీరో…!

మలయాలకుట్టి అనుపమ పరమేశ్వరన్ కి కేవలం మలయాళ పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపు ఉంది. గ‌త‌ సంవత్సరం ఈమె రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో ఉంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఓ హీరోని ప్రేమిస్తుందని, అయితే అహీరో మాత్రం పట్టించుకోవటం లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే అనుపమ ఆ హీరోని వన్ సైడ్ లవ్ చేస్తుందంటూ తెలుస్తుంది.

ఇక ఈమె తన అందం చూపు తిప్పుకొని విధంగా ఉంటుంది. అలాంటిది ఈ అందగత్తెను పట్టించుకోని హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అనుపమ తన కెరీర్ మొదట్లో ఓ క్రికెటర్ పై ప్రేమ పెంచుకునీ కొన్ని రోజులు అతన్ని ప్రేమించింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ క్రికెటర్ పెళ్లి చేసుకుని త‌న‌ ఫ్యామిలీ లైఫ్ తో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అనుపమ ప్రేమ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jasprit Bumrah getting married to actress Anupama Parameswaran? Here's what her mother said

ఆమె ఆ పోస్ట్ లో ఏం పెట్టిందంటే నేను ఇంకా లవ్ లోనే ఉన్నాను.. సినిమాల్లో వచ్చే ప్రేమకథలు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను కూడా ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆ పోస్టులో చెప్పుకొచ్చింది. ఆ పోస్ట్ చూసిన ఓ నెటిజన్ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు ఆమె పేరు చెప్పకుండా నేను ప్రేమలో ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

South Sensation Anupama Sizzles in Gorgeous Ethnic Wears And We Are Left Smitten!

అంతేకాకుండా తనది వన్ సైడ్ లవ్ అని తను ప్రేమించే హీరో తన గురించి అసలు పట్టించుకోవటం లేదని కూడా చెప్పుకొచ్చింది. కానీ హీరో పేరు మాత్రం అనుపమ బయటపడలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసాక చాలామంది ఈ అందమైన అమ్మాయిని ఎవరైనా కాదనుకుంటారా ఇంతకీ అనుపమను దూరం పెట్టే ఆ హీరో ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో అనుపమ ప్రేమ విషయం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest