ప్రియుడు విషయంలో అషు రెడ్డి కోరికలు ఏంటి ఇలా ఉన్నాయి.. ఫ్యాన్స్ షాక్??

అషు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. రెండు సార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించున్న ఈ అమ్మడు మధ్యలోనే బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోస్ చేస్తూనే వెండితెరపై కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూలతో ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇంత బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ కాస్త సమయం దొరికితే విహారయాత్రలకు చెక్కేస్తుంది. ఇక అక్కడ ఆమె చేసే హడావిడి మాములుగా ఉండదు. కొత్త కొత్త ప్రదేశాలలో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆగ్రాకి వెళ్లి తాజ్ మహల్ ముందు నిలబడి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజ్ మహల్ ముందు నిలబడి ఫొటోలు దిగిన అషు ఆ ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ నాక్కూడా షాజహాన్ లాంటి ప్రియుడు కావాలి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా షాజహాన్ నీలాగా ప్రేమించే ప్రేమికుడు దొరకేలా నన్ను ఆశీర్వదించు అని కోరుకుంది. ఈ విధంగా తనకు కాబోయే ప్రియుడికి ఉండాల్సిన క్వాలిటీ గురించి బయట పెట్టింది అషు రెడ్డి. ఆర్జీవీతో బహిరంగంగానే అలా రొమాన్స్ చేస్తున్నప్పుడు షాజహాన్ లాంటి ప్రియుడు వస్తాడా అని చాలామంది వెటకారంగా మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ కూడా ఈమె కోరికలు విని షాక్ అవుతారు.

Share post:

Latest