యాపిల్ బ్యూటీ హన్సిక గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రియుడు సొహైల్ కతురియాతో హన్సిక ఏడడుగులు వేసింది. రాజస్థాన్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి పెళ్లికి సంబంధించిన వేడుకలను లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్ స్టార్ రెండు వారాల నుంచి ప్రసారం చేస్తున్నారు.
తాజాగా విడుదలైన ఎపిసోడ్ లో హన్సిక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే పెళ్లికి ముందుకు తన భర్త సోహైల్ ఇచ్చిన బిగ్ షాక్ గురించి వివరించింది. పెళ్లికి ముందే సోహైల్ హన్సిక పేరును తన చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడట. టాటూ వేసే టైం లో సోహైల్ హన్సిక కు వీడియో కాల్ చేశాడట. తన పేరును సోహైల్ చేతిపై టాటుగా చూసి హన్సిక ఒక్కసారిగా షాక్ అయిపోయిందట.
ఇంజక్షన్ తీసుకోవడానికే చాలా బాధపడే సోహైల్ తన పేరును టాటూ వేయించుకున్నాడని చెబుతూ హన్సిక ఎమోషనల్ అయింది. కాగా, సోహైల్ కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. హన్సిక కంటే ముందే సోహైల్ కు పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. ఆ తర్వాత హన్సికతో ప్రేమలో పడ్డాడు. ఆపై ఇద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.