తారక్ పొలిటికల్ ఎంట్రీ.. అలా ఇవ్వాల్సిందే లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!!

వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ టిడిపిలోకి ఎంట్రీ పై మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ సమయంలో టిడిపిలోకి వచ్చిన ఎలాంటి లాభం లేదని ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని తెలియజేస్తోంది. ఇక జగన్ లా ఐదేళ్లపాటు జనంలో ఉంటేనే తప్ప ఆ తర్వాత ఎన్టీఆర్ గెలిచే అవకాశం ఉంటుందని తెలియజేసింది. టిడిపిలోకి వచ్చే ఎన్నికలలో చాలా కీలకంగా మారనున్నాయని తెలియజేస్తోంది. చంద్రబాబు వయసు 80 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పుడు టిడిపి గెలవ లేకపోతే ఆ తర్వాత పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతుందని పార్టీ శ్రేణులు తెలియజేస్తున్నట్లు తెలిపింది.

Laxmi parvati Jr Ntr: లక్ష్మీపార్వతి ఫోటోను తారక్ చించేశారా.. ఈ షాకింగ్  విషయాలు తెలుసా | shocking facts about laxmi parvati junior ntr details,  laxmi parvathi, Laxmi parvati Jr Ntr, junior ntr ...

ఇక నారా లోకేష్ మాత్రం తనను తాను లీడర్గా నిరూపించుకోలేకపోవడంతో టిడిపి ఇప్పుడు అధికారంలోకి రాలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పార్టీ గెలిస్తే లోకేష్ కు అప్పజెప్పడానికి అవకాశం ఉంటుందని టిడిపి అధికారులు సైతం భావిస్తున్నారు. అందుచేతనే పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబుకు చివరి అవకాశం అన్నట్లుగా తెలియజేస్తోంది లక్ష్మీపార్వతి. కొంతమంది చంద్రబాబుకు అనుకూల వ్యక్తులు ఈ విషయంలో మద్దతు ఇస్తూ ఉండడంతో మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ను టిడిపిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుపుతోంది.

చంద్రబాబు ప్రజలలో పర్యటిస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ డిమాండ్ తగ్గలేదని చెప్పవచ్చు. ఇక మరి కొంతమంది మాత్రం చంద్రబాబు ముందే కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ పలు నినాదాలు కూడా చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం టిడిపిలోకి వస్తే లోకేష్ కు అవకాశం ఉండదని ఉద్దేశంతోనే ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురాలేదు చంద్రబాబు అని టాక్ బయట వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా చంద్రబాబు ఎన్టీఆర్ మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest