సీనియర్ హీరోలైన.. ఈ స్టార్ హీరోయిన్ కి అవకాశాలు ఇస్తారా..!!

మొదటి దేవదాసు సినిమా ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది హీరోయిన్ ఇలియానా . ఆ తర్వాత పోకిరి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయి.. కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా పేరుపొందింది. ఆ తర్వాత తన క్రేజ్ తో బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన మొదట బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత సక్సెస్ కాలేకపోయింది ఇలియానా. ఆ తర్వాత టాలీవుడ్కు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా రవితేజ సరసన రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది.
Ileana D'Cruz bold photo viral on instagram इलियाना डिक्रूज ने शेयर की  बोल्ड पिक्चर, फैंस बोले वाह - India TV Hindi
దీంతో మళ్ళీ ఎవరూ కూడా ఈమెకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఈమె కెరియర్ పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది.దీంతో బాలీవుడ్లో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇలియానాకు మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ పైన ఆసక్తి తగ్గలేదని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలియానా 36 సంవత్సరాలు అయినప్పటికీ యువ హీరోల సరసన తనకు అవకాశాలు దొరకడం చాలా కష్టమని చెప్పవచ్చు.
అందుకే సీనియర్ హీరోలైన ఈమెకు అవకాశాలు ఇస్తే తన టాలెంట్ తో మరొకసారి ఫ్రూప్ చేసుకోవాలని చూస్తుందట. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్లు తనకు అవకాశం ఇస్తారేమో అని చాలా ఆశగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండుసార్లు రీ ఎంట్రీ ఇచ్చిన డిజాస్టర్ గా పేరుపొందిన ఇలియానా ఇప్పుడు పిలిచి ఎవరో అవకాశం ఇస్తారా అని ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా ఇలియానా నటించిన తాజా చిత్రం బాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా ప్రచార భాగంలో ఇలియానా పాల్గొన్నట్లు సమాచారం.

Share post:

Latest