SSMB – 29 బడ్జెట్ తో అరాచకం సృష్టించబోతున్న రాజమౌళి..!!

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం SSMB -29 .ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలుకాకముందే ఈ చిత్రం పైన పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మేకింగ్ వంటి అంశం పైన కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ గారితో పాటు అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

SSMB 29 Release Date, Star Cast, Makers, Genre, Budget & More Details -  JanBharat Times

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని చైనా ,అమెరికా ,రష్యా ,ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలా దాదాపు 30 పైగా భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఓటీటి సంస్థలతో రాజమౌళి చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా బడ్జెట్పై ఇప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా రూ.1000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి RRR సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా, వరల్డ్ డైరెక్టర్ గా కూడా పేరు పొందారు. ఇండియన్ సినిమాకి అసలైన రిఫ్రిజంటన్గా ఈ సినిమా నిలిచేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళి అరాచానికి ప్రతిరూపం ఈ సినిమానే అంటూ పలువులు నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.