మెగాస్టార్ చిరంజీవి మనసులో శ్రీదేవి స్థానం ఇదే… వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!

టాలీవుడ్ కింగ్, మెగాస్టార్, సుప్రీం హీరో… ఇలా అతనిని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే అవుతుంది. అవును, ఆటగాడే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి అంటే మెగాభిమానులు పడి చస్తారు. మన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చిరంజీవి నటించినప్పటికీ అందులో అతిలోకసుందరి శ్రీదేవి అంటే మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన ఇష్టం.

అవును, మెగాస్టార్ మనసులో ఆమెకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కాగా ఈ విషయాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పడం జరిగింది. అవును, తాజాగా నిజం విత్ స్మిత అనే టాక్ షోకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ షోలో భాగంగా శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవితో కలిసి పని చేయడం అనేది నాకు కలిగిన అదృష్టం. తనతో ఎప్పుడు పనిచేసిన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా శ్రీదేవి తన వర్క్ ఎక్స్పీరియన్స్ ను బాగా ఆస్వాదిస్తుందని.. చెప్పుకొచ్చారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు శ్రీదేవి కలిసి జగదేకవీరుడు అతిలోకసుందరి, SP పరశురాం, మోసగాడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫిమేల్ యాక్టర్ ఎవరో చెప్పి చిరంజీవి మిగతా హీరోయిన్లకు షాక్ ఇచ్చాడు. అవును, మన మెగాస్టార్ కి నచ్చిన హీరోయిన్ మరెవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవినే. శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి డాన్స్ అంటే చాలా ఇష్టమని.. ఈ సందర్భంగా మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.