మా నారా బ్రాహ్మణి అందానికి హీరోయిన్లు కూడా సరిపోరు అంటున్న నందమూరి ఫాన్స్!

నారా బ్రాహ్మణి… ఈ పేరు తెలియని వారు తెలుగునాట ఉండనే వుండరు. నందమూరి బాలకృష్ణ కూతురు, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అందరికీ సుపరిచితురాలే. చంద్రబాబుకి కోడలు అయినా బ్రాహ్మణి వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె రాజకీయ నేపధ్యం వున్న కుటుంబంనుండి వచ్చినప్పటికీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఈమె అడపా దడపా బయట కనిపిస్తూ అందంతో జనాలను మైమరిపిస్తారు. అవును, ఆమె సినిమా హీరోయిన్ కంటే కూడా అందంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

అవును, బ్రాహ్మణి తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ లో పాల్గొనడం జరిగింది. హుస్సేన్ సాగర్ తీరాన నిర్వహిస్తున్న ఈ రేసింగ్ నీ చూడటానికి ప్రతి వీకెండ్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అక్కడికి వెళుతూ వుంటారు. ఇదివరకే ఈ ఫార్ములా రేసింగ్ చూడటానికి స్టార్ హీరోలు చరణ్, నాగచైతన్య గతంలో వెళ్లడం జరిగింది. ఇటువంటి పబ్లిక్ ఈవెంట్లలో సెలబ్రిటీలు వస్తూ ఉండటంతో ఫార్ములా వన్ ఈ రేసింగ్ కార్యక్రమంలో సందడి నెలకొంది.

కాగా ఇక్కడికి చేరుకున్న బ్రాహ్మణిని చూడటానికి స్థానికులు పెద్ద మొత్తంలో గుమిగూడారు. ఆమె స్టన్నింగ్ లుక్స్ జనాలను కట్టిపడేశాయి. దాంతో సదరు ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అవును, మోడరన్ లుక్ లో నారా బ్రాహ్మణి ఎంట్రీ ముఖ్యంగా నందమూరి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఇక్కడికి ఆమెతోపాటు తన కుమారుడు దేవాన్సు సైతం రావటంతో అక్కడి ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం కనిపించింది. కాగా ఆమె అందం విషయమై నందమూరి అభిమానులు ఆమెని ఆకాశానికెత్తేస్తున్నారు.