యంగ్ బ్యూటీ శ్రీలీల టైం బావుంది… పిచ్చెక్కిస్తున్న ఫోటో షూట్!

నవతరం యంగ్ బ్యూటీ శ్రీలీల ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు సినిమా ‘పెళ్లి సందD’ చేసిందోగాని ఆ సినిమా తర్వాత శ్రీలీల జాతకం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస చిత్రాలకు సైన్ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఆమె సినిమా ఆఫర్లు అందుకోవడం వెనుక దర్శకేంద్రుడి హస్తం ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఆమె తాజాగా చేసిన ధమాకా చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీల ఫుల్ హ్యాపీగా వుంది.

ఇపుడు చాలామంది టాలీవుడ్లో అనుకున్నది ఏమంటే, కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని. అవును, ఆమె ఇప్పటివరకు దాదాపు ఓ పది అపదిహేను సినిమాలకు సైన్ చేసిందని ఇన్సైడ్ వర్గాలు అనుకుంటున్నాయి. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన రవితేజ ధమాకా చిత్రం అని అనుకోవచ్చు. అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్ అని మీకు తెలుసా?

ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూసినవారు ఆమె ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టడం ఇపుడు చాలామందికి కుళ్ళు కలుగుతోంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో గ్లామర్ షోతో కట్టి పడేసింది. శిల్పం మాదిరిగా కనబడుతున్న శ్రీలీల అందాలను చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. స్టన్నింగ్ బ్యూటీతో శ్రీలీల ఊపిరి ఆడనీయడం లేదు. ఆమె ధరించిన డ్రెస్, కురుల అందం, ఊరిస్తున్న పెదవులు ఇలా ఒక్కటేమిటి టాప్ టూ బాటమ్ గ్లామర్ తో శ్రీలీల కట్టి పడేస్తోంది.